కొండపి: టంగుటూరు పట్టణంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు
ప్రకాశం: టంగుటూరు పట్టణంలో అక్రమంగా మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ మహిళతోపాటు ఓ వ్యక్తిని ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం అమ్ముతున్న వ్యక్తుల వద్ద నుంచి 56 క్వాటర్ల మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితులను అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.