గిద్దలూరు: గిద్దలూరులో బాలిక బాలురులకు ఆత్మ రక్షణ విద్యను నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కరాటే మాస్టర్ శ్రీనివాసులు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో బాలురులకు మరియు బాలికలకు కరాటే విద్యను నేర్పిస్తూ మాస్టర్ శ్రీనివాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విద్య ఎంతో వారికి అవసరమవుతుందని అందుకే వారికి ఈ కారాటే విద్య నేర్పిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఉత్సాహంవంతంగా నేర్చుకున్న కారాటే విద్యార్థులను పోటీలకు తీసుకువెళుతున్నట్లు కూడా తెలిపారు. ఆత్మ రక్షణ కోసం లేదా ఇతరుల ప్రాణాలను రక్షించే సమయంలో మాత్రమే ఈ విద్యను వినియోగించాలని విద్యార్థులకు చెబుతున్నట్లు ఆయన అన్నారు.