తాడిపత్రి: మా సినిమాను ఆదరించండి: పెద్దవడుగూరు మండల పరిధిలోని గేట్స్ కాలేజీలో తెరచాప హీరో, హీరోయిన్లు నవీన్ రాజ్, స్త్రీలు
మా సినిమాను ఆదరించాలని గేట్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు తెరచాప సినిమా హీరో నవీన్ రాజ్, హీరోయిన్లు శ్రీలు, పూజ సుహాసిని, నిర్మాత దుర్గం కైలాస్ విజ్ఞప్తి చేశారు. పెద్దవడుగూరు మండల పరిధిలోని గుత్తి శివారులోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం తెరచాప మూవీ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసలు పడి సినిమాను తీశామన్నారు. అందరూ చూడాలన్నారు. చిన్న సినిమాలను ఆదరిస్తే మాలాంటి కళాకారులు మరిన్ని సినిమాలు తీయడానికి ముందుకు వస్తామన్నారు.