కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో రుద్రం పల్లి గ్రామానికి చెందిన రైతు కురుబ మహా లింగ మృతి
కర్నూలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లికి చెందిన రైతు కురబ మహాలింగ మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే రుద్రంపల్లి గ్రామానికి చెందిన మహాలింగ చిలగడ దుంప పంటను సాగు చేశాడు. చిలకడ దుంపను బొలెరో వాహనంలో హైదరాబాదు తరలిస్తుండగా మార్గం మధ్యలో కర్నూలు వద్ద బొలెరో ప్రమాదానికి గురైంది. మహా లింగ స్పాట్లోనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.మహాలింగ మృతి చెందడంతో రుద్రంపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.