దర్శి: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆమెకు అందజేశారు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలు నిర్ణయిత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చూడడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.