గిద్దలూరు: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో రైతు రాంభూపాల్ రెడ్డి పొలంలో కాలిపోయిన డ్రిప్పు పైపులు, లక్ష రూపాయలు ఆర్థిక నష్టం
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన సుర రాంభూపాల్ రెడ్డి పొలంలో డ్రిప్పు పైపులు కాలిపోయాయి. పొలంలో అకస్మాత్తుగా మంటలు జరిగి లక్ష రూపాయలు విలువ చేసి డ్రిప్పు పైపులు కాలిపోయినట్టు రైతు వాపోయా. వారి ఆముదాలు వేసినట్లు రైతు వెల్లడించారు. అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే లోపే పైపులన్నీ కాలిపోయాయి. నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు రాంభూపాల్ రెడ్డి వేడుకుంటున్నాడు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం పోలీసులు విచారణలో గుర్తించవలసి ఉంది.