మార్కాపురం: మార్కాపురం ప్రాంతానికి వైసీపీ నాయకులు చేసింది ఏమీ లేదని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం చేసింది చెప్పాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని జాతి అంకితం చేస్తున్నామని ఈ ప్రాంత ప్రజలను వైసిపి మోసం చేశారన్నారు. మార్కాపురం జిల్లా సాధించాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం, రిలయన్స్ బయోగ్యాస్ పరిశ్రమ స్థాపించి యువతకు రైతులకు ఉపాధి కల్పించబోతున్నామన్నారు. వైసీపీ నాయకులు చేసిందేమీ లేదన్నారు.