మార్కాపురం: పొదిలి మండలం రాజుపాలెంలో హత్యకు పాల్పడ్డ 13 మందికి జీవిత ఖైదీ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన మార్కాపురం కోర్టు
మార్కాపురం జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2017 వ సంవత్సరంలో పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిని 13 మంది కలిసి పాత గొడవల నేపథ్యంలో హత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి సాక్షాదారులను కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి విచారణ చేపట్టిన కోర్టు నేరం రోజు కావడంతో 13 మందికి జీవిత ఖైదు జైలు శిక్ష విధించడమే కాకుండా రూ.1000 ఒక్కరికి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.