మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద టీడీపీ పార్టీలో చేరిన వైసీపీ నాయకులు
మార్కాపురం జవహర్ నగర్ కాలనీ లోని ఎమ్మెల్యే స్వగృహంలో వైసీపీ నాయకులు టిడిపిలో చేరారు. మండలంలోని ఎల్బిఎస్ నగర్ కు చెందిన వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి రామ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు. వారికి సాధారణంగా పార్టీ కండవలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి వైసిపి నాయకులు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.