గిద్దలూరు: రాచర్ల మండలం పలుగుంటపల్లి గ్రామంలో ఇంటిలోని నిర్మాణాలు కూల్చివేసిన దుండగులు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం పలుగుంటపల్లె గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని ధ్వంసం చేశారు. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిని ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి ప్రవేశించి ఇంటి నిర్మాణాలు, టైల్స్ ను పగలగొట్టారు. ఉదయం నిర్మాణాలు చేపట్టేందుకు వచ్చిన కూలీలకు ఇంటిని ధ్వంసం చేసి ఉన్న విషయాన్ని గుర్తించి భాస్కర్ రెడ్డికి సమాచారాన్ని అందించారు. భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా నిర్మాణంలో తమ ఉన్న ఇంటిని ధ్వంసం చేశారని దీనివల్ల రూ.2 లక్షల ఆర్థికంగా బాధితులు నష్టపోయాడు.