మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను విస్తృతంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విస్తృతంగా తనిఖీలు చేశారు. ప్రతి వార్డులోని ల్యాబ్ సిబ్బంది పనితీరును ఆరా తీశారు. అందులో ఉన్న పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. మెరుగైన వైద్య సదుపాయం అందించడానికి వైద్యుల కొరత, ఆపరేషన్ పరికరాలు అవసరమని గుర్తించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.