దర్శి: గుంటి గంగమ్మ ఆలయ సమీపంలో సిమెంటు లారీని టిప్పర్ ఢీకొనడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలు
Darsi, Prakasam | Apr 29, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంటు లోడుతో వెళ్తున్న లారీని శివరాంపురం రోడ్డు మలుపు వద్ద వెనుక వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ తరలించారు.