కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ఏ డీ సీ సీ బ్యాంక్ భవన నిర్మాణ పనులు ప్రారంభం
కళ్యాణదుర్గంలో రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఏ డీ సీ సీ భవన నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. బ్యాంకు మేనేజర్ పనిభూషణ్ పర్యవేక్షణలో ఇంజనీర్ ప్రసాద్ భవన నిర్మాణానికి కొలతలు తీసుకున్నారు. అనంతరం భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కేవలం ఆరు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని మేనేజర్ పనిభూషణ్ కాంట్రాక్టర్ను ఆదేశించారు.