మార్కాపురం: భూగర్భ జలాల పెంపే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
జల ధార - నీటి భద్రత కార్యక్రమం ద్వారా రాబోయే 100 రోజుల్లో మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లాలోని ఎంపీడీవోలు, ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ చెరువుల పూడిక తీయడంతోపాటు, భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జలాల మట్టాన్ని కనీసం 1.5 మీటర్లు పెంచాలన్నారు. వేసవికి ముందు 6 మీ లోపు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు .