దర్శి: పూరిమెట్ల గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా వివిధ పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు
Darsi, Prakasam | Jun 26, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో పోలేరమ్మ తిరుణాల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభలపై డాన్సర్లు స్థానికులను ఆకట్టుకున్నారు. వైసిపి విద్యుత్ ప్రభ పై ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిని తము అసలు మర్చిపోమని, వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.