రాయదుర్గం: రైతుల పొలాల్లో విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లు, స్టాటర్ బాక్స్ లహచోరీతో రైతుల ఆందోళన
రాయదుర్గం పట్టణంలోని బిటిపి రోడ్డు ఏరియాలోని రైతుల పొలాల్లో విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లు, స్టాటర్ బాక్స్ లు, డ్రిప్ పరికరాలు చోరీ జరిగాయి. వెంకటేష్, బాబు, సోమశేఖర్, మహేష్ అనే నలుగురు రైతుల పొలాల్లో సుమారు 50 వేలు విలువైన వైర్లు, పరికరాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు వారు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించి గురువారం పిర్యాదు చేశారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఇలాంటి చోరీలే జరిగాయని రైతులు తెలిపారు. దొంగలను పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.