కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 752 బేళ్లు కొనుగోలు: వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్
కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో 752 బేళ్లు కొనుగోలయ్యాయని వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని మూగచింతల, నెన్నూరుపాడు, చతుకుపాడు గ్రామాలకు చెందిన రైతులు 917 బేళ్లను వేలానికి తీసుకు రాగా, 118 బేళ్లను తిరస్కరించారు.పొగాకు గరిష్ట ధర కేజీ రూ.280, కనిష్ట ధర కేజీ రూ.225, సరాసరి ధర కేజీ రూ.258గా నమోదైంది