కొండపి: పొన్నలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యధికారులు ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం
పొన్నలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యధికారులు ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ.. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ చెత్త చెదారం లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.