కొండపి: ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకొని టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణ
ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకొని టంగుటూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కొండపి రోడ్డు వరకు మండల వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వైద్యులు ప్రసాద్, జయలక్ష్మి మాట్లాడుతూ.. దోమల ద్వారానే మలేరియా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇంటి పరిసరాల వద్ద ఉన్న నీటి గుంతలను, ఖాళీ డ్రమ్ములను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వారు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని అన్నారు.