కొండపి: పొన్నలూరులో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించిన ఎంపీడీవో సుజాత
పొన్నలూరు PHC కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ డబ్ల్యూ ఎస్ సహకారంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో డాక్టర్ పి. సుజాత శనివారం ప్రారంభించారు. ఈ పథకాన్ని మహిళలు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. శిక్షణ కాలపరిమితి 70రోజులని, 144 మంది శిక్షణకు అర్హులుగా ఉన్నారని ఆమె అన్నారు.