కనిగిరి: టిడిపిలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: టిడిపిలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు కనిగిరిలోని ఎమ్మెల్యే నివాసంలో టిడిపి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా టిడిపి ముఖ్య నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పోలింగ్ బూత్ స్థాయి నుండి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ కమిటీల్లో పెద్దపీట వేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నారు.