కనిగిరి: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ సూచించారు. కనిగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ... ఇటీవల యువత గంజాయి తదితర మత్తుపదార్థాలకు బానిసలు అవుతున్నారని, వాటి వినియోగం వల్ల జీవితం నాశనమవుతుందన్నారు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు.