కనిగిరి: పట్టణంలోని అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని అన్న క్యాంటీన్ ను శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో భోజనాన్ని ఆయన పరిశీలించారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలను ఆదుకునేందుకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని ఎమ్మెల్యే అన్నారు. అన్న క్యాంటీన్ కి వచ్చే పేదలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా అన్న క్యాంటీన్ కు వచ్చే పేదల పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు.