మార్కాపురం: పొదిలి పట్టణంలో స్వచ్ఛ రథలను ప్రారంభించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఎదురుగానే తిట్టుకున్న టిడిపి నేతలు
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో స్వచ్ఛ రధాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే నారాయణరెడ్డి చేతుల మీదుగా జరిగింది. స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఆయన ప్రజలు తమ ఇంటిలో పనికిరాని వస్తువులను స్వచ్చ రధాలు అందించి నిత్యవసర వస్తువులను పొందాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఇక కార్యక్రమం అనంతరం స్థానిక టిడిపి నేతలు ఎమ్మెల్యే ముందే తిట్టుకున్నారు. గతంలో వైసీపీలో ఉన్న ఒక కార్యకర్తకు స్వచ్ఛరథం ఇప్పించడం పై నేతలు దూషించుకున్నట్లు తెలుస్తుంది.