గిద్దలూరు: గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో అర్ధరాత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సంజీవిని ఆసుపత్రి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ఈనెల 27వ తేదీన గిద్దలూరు మండలంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. దాదాపు రెండు గంటల పాటు సభా ప్రాంగణంలోని ఉండి వేదిక నిర్మించే ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.