మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్టు గృహం సమీపంలో యువకుడు అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. పెద్దారవీడు మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన కుర్రపోలు నాగరాజుగా గుర్తించారు. తీవ్ర గాయాలతో మృతదేహం లభించడంతో ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ దోర్నాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.