రాయదుర్గం: పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల్లో ఆకట్టుకున్న ఫైర్ సిబ్బంది విన్యాసాలు
అగ్నిప్రమాదాలపై రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అగ్నిమాపక దళం నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం మద్యాహ్నం వినాయక కూడలి, బస్టాండు తదితర ప్రాంతాల్లో నీటితో విన్యాసాలు ప్రదర్శించారు. వేసవి కాలంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్ సూచించారు. ప్రజలకు అర్దం అయ్యేలా కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు.