మార్కాపురం: జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పీర్ల పండుగ వేడుకలు ఘనంగా ముగింపు
మార్కాపురం జిల్లా కేంద్రంలో పీర్ల పండగ వేడుకలు ఘనంగా ముగిశాయి. గత మూడు రోజులగా వివిధ కార్యక్రమాలతో పీర్ల చావిడిలో ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజు పీర్లకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలతో యువత కేరింతలు గొడుతూ ఉత్సాహంగా డాన్సులు వేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని పీర్లు ఒకచోటికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది