కనిగిరి: మొహర్రం, తొలి ఏకాదశి పండుగలు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలి: కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
కనిగిరి: రానున్న మొహర్రం, తొలి ఏకాదశి పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరూ మతసామరస్యాన్ని పాటించాలని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు కనిగిరిలోని సర్కిల్ కార్యాలయంలో గురువారం హిందూ, ముస్లిం మత పెద్దలతో డీఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మొహర్రం, తొలి ఏకాదశి పండుగలు సందర్భంగా ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని మత పెద్దలకు సూచించారు. పండుగల సందర్భంగా ఏ విధంగా నడుచుకోవాలో బైలాను రూపొందించి, బైలా ప్రకారం పండుగలను అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు