కనిగిరి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అధికారులు, విద్యార్థులతో కలిసి కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ కాలుష్యాన్ని రూపుమాపాలన్నా మొక్కలను పెంచి పచ్చదనాన్ని పెంపొందించవలసిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మొక్కల పెంపకం పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు.