యర్రగొండపాలెం: కూతురితో సన్నితంగా ఉన్నాడని ఓ యువకుడిని హత్య చేసి ముక్కలు చేసి నీటి బోరులో పడేసిన తల్లిదండ్రులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లో ఆంజనేయులు అనే యువకుడిని హత్య చేసి ముక్కలు చేసి నీటి బోర్ లో పడేసిన ఘటన బుధవారం కలకలం రేపింది. తన కూతురితో సన్నిహితంగా ఉండడంతో వెంకటనారాయణ రమణమ్మ దంపతులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసు విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును చేదించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.