గిద్దలూరు: గిద్దలూరు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటనలో అపశృతి, సభకు వచ్చిన టిడిపి కార్యకర్త గుండెపోటుతో మృతి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశృతి చోటుచేస్తుంది. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సంజీవిని ఆసుపత్రి ప్రారంభించేందుకు పర్యటించారు. సభ జరుగుతుండగా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన శ్రీరామ్ రవి అనే టిడిపి కార్యకర్త గుండెపోటుకు గురై మృతి చెందాడు. గుండెపోటుకు గురైన సమయంలో తోటి కార్యకర్తలు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో తోటి టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు రవి మృతితో బోరున విలపించారు.