గిద్దలూరు: అర్ధవీడు మండలంలో కన్న కొడుకుని హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మిట్టమీదిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రి కొడుకుపై దాడి చేసి హతమార్చి భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన పఠాన్ సిలార్ కొడుకు జావేద్ మంచంలో నిద్రిస్తుండగా క్రికెట్ బ్యాట్ తో దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో కొడుకు జావేద్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. తీవ్రంగా గాయపడ్డ జావేదును కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కొడుకు మృతితో ఆందోళన చెందిన తండ్రి సిలార్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రెండు మృతదేహాల