యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది పలు ప్రాంతాలలో రహదారులపై నేలకొరిగిన చెట్లు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో త్రిపురాంతకం పుల్లలచెరువు ఎర్రగొండపాలెం లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా సాయంత్రం ఒకసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో త్రిపురాంతకం మండలం మేడేపి టోల్గేట్ పైకప్పు ఒకసారి గా లేచి రోడ్డుపై పడింది. అదేవిధంగా రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు రహదారిపై చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు.