రాయదుర్గం: పట్టణంలో తాగునీటి కోసం సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
తాగునీటి కోసం రాయదుర్గం పట్టణంలోని 5 వ సచివాలయం వద్ద మహిళలు శనివారం ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. 5వ వార్డు పరిధిలో గత 15 రోజులుగా నీరు విడుదల చేయలేదని మహిళలు తెలిపారు. తిండి లేకపోయినా ఉండవచ్చని తాగేందుకు నీరు లేకపోతే ఎలా అని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఏరియాలో తక్షణమే నీరు విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వసంతకుమార్ గౌడ్, రఫిక్, మహబూబ్ బాషా మద్దతుగా పాల్గొన్నారు.