యర్రగొండపాలెం: దోర్నాల పట్టణంలో బిఎల్ఎ ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో వైసిపి బిఎల్ఎ ల అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎల్ఎ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు తొలగింపుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతి ఓటు నమోదయి ఉండేలా పర్యవేక్షించాలని అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బిఎల్ఎ లు క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.