యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం వాస్తవ్యులు దేవులపల్లి విశ్వనాథం శర్మ రచించిన శ్రీ శంకర శతకం పుస్తక ఆవిష్కరణ
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం వాస్తవ్యులు అష్టావధాని దేవులపల్లి విశ్వనాథం శర్మ రచించిన శ్రీ శంకర శతకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మార్కాపురం చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత జగన్నాథం మాట్లాడుతూ 12వ శతాబ్దం నుండి నేటి వరకు మన తెలుగు భాషలో శతక సాహిత్యం నిత్య నీరాజనాలు పొందుతున్నాయన్నారు. 50 రచనలు చేసిన ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథం శర్మ మార్కాపురం జిల్లాకు గర్వకారణం అన్నారు.