కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో టీడీపీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో శనివారం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీదేవి నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. లక్ష్మీదేవి మాట్లాడారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం నిరంతరం జ్యోతిరావు పూలే పోరాటం చేశారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.