రాయదుర్గం: 7 మంది ఆర్టీసి ఉద్యోగులు ఎంప్లాయీస్ యూనియన్ కి రాజీనామా, నేషనల్ మజ్దూర్ యూనియన్ లో చేరిక
ఏపిఎస్ ఆర్టీసి రాయదుర్గం డిపో పరిధిలో 7 మంది ఎంప్లాయిస్ యూనియన్ కు రాజీనామా చేసి నేషనల్ మజ్దూర్ యూనియన్ లో చేరారు. ఈ సందర్భంగా శనివారం డిపో వద్ద యూనియన్ డిపో కార్యదర్శి హెచ్. తిప్పేస్వామి యూనియన్ నాయకులు వారికి స్వాగతం పలికారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. త్వరలో యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అందులో ఎన్ఎంయూ సత్తా చాటుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎంయు చేస్తున్న కృష్ణ కి వారు ఆకర్షితులై తమ యూనియన్ లో చేరినట్లు వెల్లడించారు.