గిద్దలూరు: కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలో విదేశీ పక్షుల సందడి, యూరప్, ఆఫ్రికా నుంచి వచ్చిన పక్షులు
విదేశీ అతిథులు వచ్చేసాయి. యూరప్ ఆఫ్రికా, ఆసియాలోని అతి కొన్ని ప్రాంతాలలో కనిపించే అరుదైన స్పూన్ బిల్ పక్షులు మార్కాపురం జిల్లాలో దర్శనమిస్తున్నాయి. కంభం మండలం తురిమెళ్ళ గ్రామ చెరువులో ఈ పక్షులు సందడి చేస్తుండగా పక్షి ప్రేమికులు వీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2020 సంవత్సరం తర్వాత ఈ పక్షులు మరోసారి ఈ చెరువులో కనిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీరు ఉండి చిత్తడి భూమి ఉండే ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జీవించడమే కాకుండా వేటను సాగించి చేపలు తింటాయి. వీటి ముక్కు అచ్చం గరిట వల్ల ఉండడంవల్ల గరిటె ముక్కు పక్షులని, కొందరు తేడు మూతి కొంగలు అని అంటారని పక్షి ప