మార్కాపురం: క్షణికావేశంలో తప్పులు చేసి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకొని జైలు పాలు కావద్దని సూచించిన న్యాయమూర్తి రామకృష్ణ
క్షానిక ఆవేశంలో తప్పులు చేసి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుని జైలు పాలు కావద్దని ఇన్చార్జి జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును న్యాయమూర్తి సందర్శించి అక్కడ ఖైదీలకు అందుతున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ సహాయం అవసరమైన ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం చేస్తామన్నారు