మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన ప్రమాదకర కలుపు మందు పారా క్వాట్ డైక్లోరైడ్ పలు దుకాణాలలో ఉన్నట్లు గుర్తించారు. వాటి విక్రయాలు నిలుపుదల చేయాలని వారిని సూచించారు. నిషేధిత మందులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.