యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెంలో పదవతరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
గురువారం వెలుబడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎర్రగొండపాలెం మండలం ఆమని గుడిపాడు కు చెందిన చంద్రశేఖర్ అనే విద్యార్థి 349 మార్కులు వచ్చాయని మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకోగా సమీప నివాస గృహాల వారు గమనించి వైద్యశాలలో చేర్పించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లు చెప్పారు.