తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఆమోదించడంతో యాడికిలో టీడీపీ, జనసేన నాయకులు బైక్ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పార్లమెంటులో బిల్లు ఆమోదించబడడంతో యాడికి లో గురువారం టీడీపీ, జనసేన నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. యాడికి లోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు, జైశ్రీరామ్ అంటూ పెద్ద పెట్టునా నినాదాలు చేశారు. సుమారు గంటపాటు ర్యాలీ నిర్వహించారు. సంబరాలు మునిగిపోయారు.