యర్రగొండపాలెం: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు గెలవడంతో ఎర్రగొండపాలెం లో క్రీడాభిమానులు సంబరాలు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్ఈడి స్క్రీన్ పై ఆర్ సి బి, జిటి ఫైనల్ మ్యాచ్ వీక్షించిన అభిమానులు బెంగళూరు గెలవడంతో ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. టపాసులు పేల్చి నినాదాలు చేస్తూ తమ అభిమాన జట్టు విజయాన్ని పండగల జరుపుకున్నారు.