కొండపి: పొన్నలూరు మండలం భోగనంపాడు గ్రామంలో తమ భూమిని బంధువులే కాజేశారని మీడియా ముందు వాపోయిన బాధితులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని భోగనంపాడు లో తమ భూమిని కబ్జా చేశారని బాధితులు తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన బాధితులు బంధువులే తమ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని అధికారుల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగలేదని వారు వాపోయారు. అధికారులే కబ్జాదారులకు సహకరించినట్లు తిరుపతమ్మ ఆరోపించారు.