గిద్దలూరు: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన యువతి భయంతో ఆటో నుంచి దూకడంతో తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన యువతీ భయంతో ఆటో నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. బ్యాంకు పని పైన సంజీవరాయుని పేటకు వెళ్ళిన యువతి తిరిగి ఆటోలో ఇంటికి వస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ రహదారి మల్లింపు చేయడం వల్ల ఆందోళన చెందిన యువతి ఆటోలో నుంచి కిందకు దూకింది. ఆటో డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.