తాడిపత్రి: పెద్దపప్పూరు మండల కేంద్రంలో అందరినీ అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
అందరినీ ఆకట్టుకున్న చిన్నారుల చెక్కభజన, నృత్య పోటీలు పెద్దపప్పూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతులును ఎంతగానో అలరించాయి. చిన్నారులు చెక్కభజన చేశారు. నృత్యం చేశారు. చిన్నారులు చేసిన చెక్కభజన, నృత్య పోటీలు అందరినీ ఉత్సాహపరిచాయి. సుమారు మూడు గంటలు పాటు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.