మార్కాపురం: జిల్లా కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫారం ల వద్ద చెత్తాచెదారం నిల్వ చేయవద్దని తెలిపిన అధికారులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద చెత్తాచెదారం నిల్వ చేయొద్దని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అలా చేయడం వల్ల మూగజీవాలైన ఆవులు చెత్తాచెదారం తినడానికి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. ఆ ప్రాంతాలలో చెత్త లేకుండా పారిశుద్ధ్య కార్మికులు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.