మార్కాపురం: జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదాలు పై అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ
మార్కాపురం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో సందర్భంగా పట్టణంలో రాయవరం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ వద్ద ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనుకోకుండా ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. పాంప్లెట్స్ ను అందజేసి అవగాహన కల్పించారు.